Tuesday 25 October 2016

StudyCircle Meeting on TODAY

ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భీమవరం:
ఆర్యా! 
ది.26.10.2016 సాయంత్రం 6.00 గంటలకు మన UTF ఆఫీస్ (శ్రీ కలిదిండి రాఘవరాజు టీచర్స్ హోమ్) భీమవరం నందు స్టడీ సర్కిల్ నిర్వహించబడును.
అంశం: విద్యారంగంలో వ్యాపారీకరణ పెంచే జాతీయవిద్యావిధానం ముసాయిదా-2016.
పశ్చిమ గోదావరి జిల్లా UTF ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ B.గోపీమూర్తి ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిధి గా హాజరు కాబోతున్నారు.
కావున ఈ కార్యక్రమం నకు ఉపాధ్యాయులు, యూ.టీ.ఎఫ్ కార్య కర్తలందరూ తప్పక పాల్గొని జయప్రదం చేయగలందులకు భీమవరం డివిజన్ పక్షాన్న కోరుచున్నాం.
-UTF భీమవరం డివిజన్ కమిటీ.

Thursday 6 October 2016

CSE NEW ADDRESS

ఉపాధ్యాయ మిత్రులార!

విద్యాశాఖ అడ్రస్సు మారింది

నూతన అడ్రసు ::

*CSE  NEW  ADDRESS*

ALL the officers are requested
to note the change of address for all
correspondence / communications / letters /
medical reimbursement bills etc.,
with the Commissioner of School Education.

*The new address is:*
O/o Commissioner of School Education,
Anjaneya Towers, B-Block,
LANCO Circle,
Beside Ibrahimpatnam Police Station,
Ibrahimpatnam,
Vijayawada – 521 456,
Krishna District. Amaravathi.

A.P రాష్ట్ర విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు ది7.10.2016 నుండిఆ.ప్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుల తొ ఙరుపు అన్నిరకాల ఉత్తర ప్రత్యుత్తరములు , లేఖలు  మెడికల్ బిల్స్ మొ. పంపవలసిన కొత్త అడ్రసు
O/o commissioner and director of school education,
Anjaneya towers,B-Block,
Beside ibrahimpatnam p.s,
Ibrahimpatnam,
Vijayawada 521456.
Krishna district.AMARAVATHI
VIDE DSE PROCS RC NO 01/EStt V / 201y dt 5.10.2016
Amaravathi.
Andhra Pradesh

Monday 27 June 2016

CPS RADDU

సీపీఎస్  రద్దు కోరుతూ నవంబర్ 29న

🌸 "మార్చ్ టు పార్లమెంట్" 🌸

Saturday 11 June 2016

Academic year 2016-17 CALENDER

AP Schools Academic Calendar 2016-2017

AP Academic Calendar Main Activities

Re Opening of the Schools : 13-06-2016

Examination schedule

Formative Assessment 1 (FA1 ) : Before 30th July, 2016

Formative Assessment 2 ( FA 2 ) : Before 30th August, 2016

Formative Assessment ( FA 3 ) : Before 30th Nov, 2016

Formative Assessment ( FA 4 ) : Before 28 Feb, 2017

Summative Assessment 1 ( SA 1 ) : 21-09-2016 to 28-09-2016

Summative Assessment 2 ( SA 2 ) : 03-01-2017 to 10-01-2017

Summative Assessment 3 ( SA 3 ) : 07-03-2017 to 22-03-2017

Pre-Final Exam for 10th class:15-02-17 to 27-02-17

Term Holidays:

1. 1st term Holidays ( Dasara ) : 30-09-2016 to 11-10-2016

2nd term Holidays ( Sankranthi ) : 11-01-2017 to 19-01-2017

3. Christian Minority Schools Holidays: 24-12-16 to 30-12-16

Summer vacation ( Holidays ): 24-04-17 to 11-06-17

Friday 10 June 2016

EHS EYE HOSPITALS

కామన్‌స్కూల్‌

UTFWG:  
09/06/2016
Telugu News >> ఆంధ్రజ్యోతి >> Editorial

💰💰కాసుల చదువుల మధ్య కామన్‌స్కూల్‌ కల✏📒

మౌలిక వసతుల కల్పన పేరుతో రోడ్ల మీద రోడ్లు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు కడతారు కానీ, అన్నిటికంటె కీలకమయిన మౌలిక సదుపాయాలు విద్య, ఆరోగ్యం- అన్న గుర్తింపు ఉండదు. ఈ రెండు రంగాలను కూడా మార్కెట్‌కు వదిలివేసి, దేశభవిష్యత్తును ప్రమాదంలో పడవేశాయి ఇటీవలి ప్రభుత్వాలు. కమ్యూనిటీ కనుసన్నలలో మంచి చదువులు కామన్‌స్కూళ్లలోనే సాధ్యం. సర్కారుబడులు గతంలో అవే పనిచేశాయి. వాటిని పటిష్టమూ సుస్థిరమూ చేయడం ద్వారానే ఇప్పుడు కూడా ఆ కలను నెరవేర్చుకోవచ్చు. భారత్‌కు పొరుగున ఉన్న అతి చిన్న దేశం భూటాన్‌. రాచరికం నుంచి ప్రజాస్వామ్యానికి శీఘ్ర పరివర్తనలో ఉన్నది. పదకొండో తరగతి దాకా అందరికీ నాణ్యమయిన ఉచిత విద్య అందించడం ఆ దేశ విద్యావిధానంలో ఒక ముఖ్యమయిన అంశం. హైయర్‌ సెకండరీ విద్య దాకా చదువు చెప్పే ప్రభుత్వ స్కూళ్లు ఆ దేశంలో 1300 ఉంటే, ప్రైవేటు స్కూళ్లు 24 మాత్రమే ఉన్నాయి. స్థానిక భాష జోంఖా, ఇంగ్లీషు, లెక్కలు- ఈ మూడు ఆ దేశ విధానకర్తలు ప్రధానంగా భావించిన విద్యాంశాలు. పదకొండో తరగతి ముగిసే నాటికి జోంఖా భాషలో వ్యవహారిక, పరిపాలనా, సాహిత్య అవసరాల కోసం చదవడం, రాయడం విద్యార్థులకు రావాలి. ఇంగ్లీషులో మాట్లాడడం రావాలి. ప్రభుత్వ కార్యాలయాలలో జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయిలో లెక్కలు చేయగలగాలి. టూరిజం ఒక ప్రధాన ఉపాధి అయిన ఆ దేశంలో సంబంధిత వృత్తుల్లో ఉన్న యువతీయువకులు అవసరమైన మేరకు ఇంగ్లీషు మాట్లాడగలరు. భారత సినిమాలు, టీవీల ప్రభావంతో హిందీ కూడా మాట్లాడగలరు. అదనంగా కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకుని ఉద్యోగాలూ సంపాదించుకోగలరు. ఉన్నత విద్యకు అవకాశాలు ఆ దేశంలో పరిమితమే అయినప్పటికీ, హైస్కూలు విద్య ఆ సమాజానికి ఈ దశలో కావలసిన కనీస మానవవనరులను అందించడంతో పాటు, ఒక స్థాయి ఉపాధిని గ్యారంటీ చేస్తున్నది. ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కోత విధించి అయినా సరే విద్యా వ్యాప్తి సార్వత్రకం చేయాలని, నాణ్యతలో రాజీ పడకూడదని ఆ దేశ పాలకులు భావిస్తున్నారు. ఆ దేశంలో సంతోషపు సూచిక ఉచ్ఛస్థాయిలో ఉండడానికి సార్వజనీన విద్య కూడా ఒక కారణం. ప్రపంచంలో అతిబలశాలి రాజ్యంగా ఉన్న అమెరికాలో కిండర్‌గార్టెన్‌ నుంచి 12వ తరగతి దాకా ప్రభుత్వం ఉచిత విద్య అందిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉచిత విద్య అందించే పబ్లిక్‌ స్కూళ్లలో అయినా, ప్రైవేటునిధులతో ఫీజులతో నడిచే స్కూళ్లలో అయినా చదివించవచ్చు. అత్యధిక అమెరికన్‌ విద్యార్థులు పబ్లిక్‌స్కూళ్లలోనే చదువుతారు. పబ్లిక్‌స్కూళ్లలో విద్య అత్యంత నాణ్యంగా ఉంటుంది. ప్రపంచంలో విద్యార్థుల మీద అత్యధికంగా తలసరి వ్యయం చేసే దేశం అమెరికా. ఆ దేశంలో చాలాచోట్ల పబ్లిక్‌స్కూళ్లు స్థానికసంస్థల పన్నుల ఆదాయంతోనే నడుస్తాయి. 12వ తరగతి తరువాత ఉన్నత విద్య ఆ దేశంలో అత్యంత ఖరీదు, అది వేరే విషయం. ఒక పెద్ద దేశం, అతి చిన్నదేశం - రెండూ చదువుని అంత ముఖ్యమయినవిగా భావిస్తుంటే, భారతదేశం ఎందుకు విద్యారంగాన్ని ఇంతగా నిర్లక్ష్యం చేస్తున్నది?ప్రభుత్వం ద్వారా ఉచిత విద్య ఇక్కడ కూడా లభిస్తున్నది. పదకొండో పన్నెండో తరగతుల వరకే కాదు, ఇంజనీరింగులూ పీహెచ్‌డీలకూ కూడా నిధులు అందిస్తున్నది. కానీ, పునాది విద్య ఎందుకు కునారిల్లిపోయింది? పదోతరగతి తరువాత చదువు నుంచి జారుకుంటున్న వారి సంఖ్య ఎందుకు అధికంగా ఉంటున్నది? ప్రభుత్వ స్కూళ్లను నిర్లక్ష్యపు ఊబిలో తోసేసి, ప్రైవేటు విద్యారంగానికి ఎందుకు వత్తాసు పలికింది? పోనీ ఆ ప్రైవేటు రంగమయినా నాణ్యమయిన, సర్వతోముఖమయిన విద్య అందించే విధంగా నియంత్రణ ఎందుకు చేయడం లేదు? ఈ ప్రశ్నలు విషాదకరమయినవి. కొత్తగా ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన వ్యక్తి అప్పుడే నిద్రలేచినట్టు, ఆడపిల్లలకు టాయిలెట్లు లేని పాఠశాలలు ఉండడమేంటి అని ఆశ్చర్యపోతాడు, ఈ దేశంలో ఇంత చెత్త ఉన్నదేమిటీ అని గుండెలు బాదుకున్నట్టు. ఈ విధ్వంసంలో అధికారంలో ఉన్న పార్టీలే కాదు, ప్రతిపక్షాలుగా చట్టసభలలో పాలుపంచుకున్న అందరికీ పాత్ర ఉన్నది. ఉచితంగా ఇస్తే చాలదు, ఆ విద్య నాణ్యంగా ఉండాలి. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుని వివిధ హోదాలలో దేశపాలనలో, సమాజరంగంలో పాత్ర నిర్వహిస్తున్నవారు ఇంకా దేశంలో అసంఖ్యాకంగా ఉన్నారు. ఎందరో మేధావులను, రచయితలను, సంఘసేవకులను, రాజకీయవేత్తలను అందించిన ప్రభుత్వ పాఠశాలలు నాణ్యత లేనివిగా ఎట్లా మారాయి? ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఎట్లా ఖాయిలా పడ్డాయో అట్లాగే, స్కూళ్లూ శిథిలమయ్యాయి. ఇప్పటికీ, మారుమూల పల్లెటూళ్లలో, గిరిజన గూడేలలో, కాలినడకన వెళ్లి పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు. పాఠశాలల నిర్వహణే జీవితంగా చదువుదీపాన్ని వెలిగించడానికి తాపత్రయపడుతున్న హెడ్మాష్టర్లూ ఉన్నారు. ఒకరో ఇద్దరో పదిమందో బాధ్యతారహితులు ఉండవచ్చు, కానీ, మొత్తం మీద ఉపాధ్యాయ వృత్తిని సీరియ్‌సగా తీసుకునే గురువులే, పిల్లలు ఎదిగి పెద్దవారయితే సంబరపడే గురువులే విరివిగా కనిపిస్తారు. కానీ, వారి తపనకు ఆలంబన ఏదీ? వ్యవస్థాగతమయిన వనరులు ఏవీ? ప్రభుత్వస్కూళ్ల మీద అపప్రథ వ్యాపిస్తుంటే, ప్రైవేటు విద్యాసంస్థల వ్యాప్తి కోసం పాలకులు దానిని అనుమతించారు. ప్రైవేటు విద్యకు వలసవెళ్లినవారు పోగా, బడుగు బలహీనులు ప్రభుత్వస్కూళ్లలో మిగిలిపోయారు. ప్రైవేటీకరణలో బాధితులు వారే. ఉచిత విద్య మీద ఖర్చు తగ్గించాలి. టీచర్ల సంఖ్య తగ్గించాలి. కొత్త నియామకాలు చేయకూడదు... ఇటువంటి ఆదేశాలను ప్రపంచప్రభువుల నుంచి తీసుకోవడం మొదలుపెట్టిన తరువాత, స్కూళ్ల పరిస్థితి మరింత దిగజారింది. ప్రాథమిక, సెకండరీ విద్యల  సంగతి సరే, ఉన్నత విద్యకు ప్రభుత్వ పెట్టుబడులు మరింత తగ్గించాలి. చదువును కూడా ఒక వ్యాపారసేవగా గుర్తించాలి. విదేశీ విద్యాసంస్థల వ్యాపారం కోసం ప్రభుత్వ విద్యాసంస్థల నిధులను, ప్రతిష్ఠను దిగజార్చాలి. ఇవి ఇటీవలి పరిణామాలు. కావాలంటే, మొన్న డిసెంబర్‌లో నైరోబీలో ఏమి జరిగింది, నిర్మలా సీతారామన్‌ ఏ అంశాల్లో రాజీపడి వచ్చారో తెలుసుకోండి. ఇక్కడ చదువుకున్నవారిని చవకగా ఎగరేసుకుపోవడం మొన్నటి దాకా చూశాం, అది బ్రెయిన్‌ డ్రెయిన్‌ అనుకున్నాం. ఇప్పుడు, ఇక్కడ చదువుచెప్పేపని కూడా వారే తీసుకుంటారు. ప్రభుత్వ విద్యను పునాదిలోనే దిగజార్చడం మొదలుపెట్టిన దశకు, ఇప్పుడు ఉన్నత విద్యను నిశ్శబ్దంగా హత్య చేస్తున్న దశకు మధ్యలో జులాయి విద్యా సంస్థలు ఎగుమతి ఆధారిత విద్యతో తెగ సొమ్ము చేసుకున్నాయి. కాంట్రాక్టర్ల తరువాత ఇప్పుడు హవా విద్యాసంస్థ యజమానులదే. రాజకీయాలలోనూ వారికిప్పుడు ఉచ్ఛదశ ప్రాప్తించింది. ఉన్నత విద్యను గ్లోబలైజ్‌ చేసే ప్రక్రియకు అనుబంధంగా ఇప్పుడు మొత్తం విద్యావిధానాన్ని ఏకరూపంగా మార్చేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. మూల్యాంకన పద్ధతులు, సిలబ్‌సలు అన్నీ మారిపోతున్నాయి. కొద్దోగొప్పో బాధ్యత కలిగిన పాత చదువులు చదివిన వారిలో ఆ విద్య చైతన్యంగానో సామాజిక అవగాహనగానో మారుతుంటే, దానిని ఉక్కుపాదంతో అణచివేయడానికి యూనివర్సిటీల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రైవేట్‌ విద్యాసంస్థల ఉధృతికి మరో కారణం ఇంగ్లీషు మాధ్యమం. ఉపాధికి, సాధికారతకు కూడా ఇంగ్లీషే మార్గమని భావించే వారిని తప్పుపట్టలేము. శుష్క భాషాభిమానంతో మాతృభాషలను కాపాడుకోలేము. ప్రజల ఆకాంక్షను, మాతృభాషల రక్షణను రెంటినీ సమన్వయం చేసే పరిష్కారాలను వెదికే తీరిక ప్రభుత్వాలకు లేదు. మౌలిక వసతుల కల్పన పేరుతో రోడ్ల మీద రోడ్లు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు కడతారు కానీ, అన్నిటికంటె కీలకమయిన మౌలిక సదుపాయాలు విద్య, ఆరోగ్యం- అన్న గుర్తింపు ఉండదు. ఈ రెండు రంగాలను కూడా మార్కెట్‌కు వదిలివేసి, దేశభవిష్యత్తును ప్రమాదంలో పడవేశాయి ఇటీవలి ప్రభుత్వాలు. విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి, కొత్తగా తీర్చిదిద్దుకోవడానికి కొత్తరాష్ట్రంగా తెలంగాణకు అవకాశం లభించింది. వివక్ష వల్ల ఏర్పడిన వెనుకబాటుతనాన్ని అధిగమించేందుకు సార్వజనీనమయిన, నాణ్యమయిన విద్యను అందించడం ఒక నమ్మదగిన మార్గం. కామన్‌స్కూల్‌ తన కల అని కేసీఆర్‌ చెప్పుకున్నారు. కమ్యూనిటీ కనుసన్నలలో మంచి చదువులు కామన్‌స్కూళ్లలోనే సాధ్యం. సర్కారుబడులు గతంలో అవే పనిచేశాయి. వాటిని పటిష్టమూ సుస్థిరమూ చేయడం ద్వారానే ఇప్పుడు కూడా ఆ కలను నెరవేర్చుకోవచ్చు. వందో రెండువందలో గురుకుల పాఠశాలలు ప్రారంభించడం 'కేజీ టు పీజీ ఉచిత విద్య'కు ప్రత్యామ్నాయం కాదు. పాఠశాలలకు కావలసిన భౌతికవనరులన్నీ సమకూర్చాలి, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేయాలి. స్కూళ్లను మూసివేయడం నిలిపివేయాలి. ఒకనాడు ప్రభుత్వ స్కూళ్లకు సమకూరిన వనరులను ఇప్పుడు వాణిజ్య అవసరాలకు మళ్లించాలనుకునే దుర్బుద్ధి మానుకోవాలి. విద్యావ్యాపారాన్ని కఠినంగా నియంత్రించాలి. విద్యారంగం మీద అధికార రాజకీయాల నీలినీడలను పారదోలాలి. అన్నిటికి మించి, చదువుల రంగాన్ని - అక్రమాదాయాల వనరుగా చూడడం ఏలికలు మానుకోవాలి. ఇంగ్లీషు మీడియం స్కూళ్ల మీద నిర్ణయం తీసుకుంటే, అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. మన సమాజానికి ఎటువంటి విద్య అవసరమో, అటువంటి విద్యను కరికులమ్‌లో పొందుపరచాలి. ఇందుకు కేవలం రాజకీయ సంకల్పం, బ్యూరోక్రటిక్‌ ఆచరణా సరిపోవు. యావత సమాజాన్ని కలుపుకుని, విద్యారంగ నిపుణుల సూచనలు తీసుకుని, క్షేత్రస్థాయి వాస్తవికతను, అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికారచన చేయాలి.రెండు సంవత్సరాలు గడచినా, ఆ దిశగా ఒకటిరెండు అడుగులు కూడా పడకపోవడం విషాదం.

Tuesday 7 June 2016

SADASSU ON VIDYA RANGA PARINAMALU

ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భీమవరం:

శ్రీ కలిదిండి రాఘవరాజు టీచర్స్ హోం(U.T.F కార్యాలయం) భీమవరం నందు 08-06-2016(బుధవారం)  మద్యాహ్నం గం.1-00ని.లకు విద్యా సదస్సుజరుగుతుంది.

అంశం: ప్రస్తుత విద్యారంగ పరిణామాలు, RATIONALISATION

హాజరగు వక్తలు:
శ్రీ V.బాలసుబ్రహ్మణ్యం MLC, PDF ఫ్లోర్ లీడర్
Sri I.వెంకటేశ్వర రావు U.T.F. రాష్ట్ర అధ్యక్షులు మరియు J.A.C.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

   ఈ కార్య క్రమంలో UTF రాష్ట్ర కార్యదర్శి శ్రీ షేక్ సాభ్జీ, జిల్లా అధ్యక్షులు శ్రీ P.జయకర్, ప్రధాన కార్యదర్శి శ్రీ B.గోపిమూర్తి పాల్గొంటారు.

   కావున పశ్చిమగోదావరి జిల్లాలోని ఉపాధ్యాయులందరూ పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర కౌన్సిలర్ CH.పట్టాభి రామయ్య, జిల్లా కార్యదర్శులు M.I.విజయ కుమార్, P.సీతారామరాజు,  CH.V.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలియజేశారు.

    - Ch.పట్టాభి రామయ్య
      UTF రాష్ట్ర కౌన్సిలర్

Wednesday 11 May 2016

FAPTO NEWS

తాజా ‌సమాచారం
ఈ రోజు (11.5.16)  ఫ్యాప్టో  నాయకత్వం ఐ.వెంకటేశ్వరరావు (యుటియఫ్), కె.నరసింహారెడ్డి (యస్టీయు), యన్.వి.రమణయ్య (డిటియఫ్) విద్యాశాఖ కార్యదర్శి ఆర్.పి.శిసోడియా గారిని కలిసి పలు సమస్యల పై చర్చించారు.

1.రేషనలైజేషన్ పై గత సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలు చేసిన సూచనలు అమలు  చేయాలని, ఏక పక్షంగా పాఠశాలలు మూసివేయరాదని కోరారు.

ఫ్యాప్టో నాయకత్వం కోరినట్లుగా రేషనలైజేషన్ పై పునఃపరిశీలన చేస్తామని, మరోసారి ఉపాధ్యాయ సంఘాల తో చర్చించి ఫైనల్ చేస్తామని వారు తెలిపారు.

రేషనలైజేషన్ వల్ల ఎన్ని పాఠశాలలు మూతపడతాయో వివరాలు సేకరించి పంపాలని డైరెక్టర్ గారిని కోరారు. "మన ఊరు - మన బడి" కార్యక్రమంలో ఎన్రోల్ అయిన విద్యార్ధుల సంఖ్య ఆధారంగా రేషనలైజేషన్ చేపడతామని తెలిపారు.

2.మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు నివాసం ఉన్న గ్రామంలోనే భోజనం ఏర్పాట్లు చేయాలి. ఉపాధ్యాయులకు సెలవు ల్లో ఈ బాధ్యతలు తొలగించాలని కోరారు.

నివాసం ఉన్న గ్రామంలో భోజనం ఏర్పాట్లు కు చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ గారిని ఆదేశించారు.ఉపాధ్యాయులకు ఎరెండ్ లీవ్ ఇస్తామని స్పష్టం చేశారు.

3.పండితులు, పిఈటీ ల అప్ గ్రేడేషన్ ఫైలు పై సియం.కార్యాలయం వారు కోరిన సమాచారం తిరిగి పంపుతున్నట్లు చెప్పారు. సంవత్సరానికి 16కోట్లు ఖర్చు అంచనాలతో పంపుతున్నట్లు తెలిపారు.

4.ఎయిడెడ్ రేషనలైజేషన్,ప్రమోషన్స్,పోస్టులు భర్తీ ఫైలు ఆర్థిక మంత్రి కి పంపినట్లు తెలిపారు.

5.అంతర్ జిల్లా బదిలీల పైలు విద్యా శాఖ మంత్రి కి పంపారు. అనంతరం ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి కి వెళుతుందని కార్యదర్శి గారు తెలిపారు.

6.సర్వీస్ రూల్స్ ఫైలు పై కేంద్ర హోంశాఖ కొన్ని వివరాలు అడిగారని, రెట్రాస్పెక్టివ్ గా ఎందుకు అమలు చేయాలి అని వివరణ కోరినట్లు తెలిపారు.

7.బదిలీ ద్వారా యంఇఓ పోస్టుల భర్తీ చేసే ఫైలు జిఏడి కి పంపినట్లు కార్యదర్శి గారు తెలిపారు.

- పి. బాబు రెడ్డి
యుటియఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

SSC Results BHIMAVARAM

UTFBVRM:

10 వ తరగతి మార్చి 2016 పరీక్ష ఫలితాలు

భీమవరం మండలం

1.అనాకోడేరు 64/64=100%
ప్రదమస్థానం:9.5

2.బేతపూడి 18/18=100%
ప్రధమస్థానం:9.5

3.చినఅనమిరం 82/82=100%
బాలికలు ప్రధమస్థానం:9.8
బాలురు ప్రధమస్థానం:9.7

4.దిర్సుమర్రు 98/101=97%
ప్రధమస్థానం:9.7

5.దొంగ పిండి 25/25=100%
ప్రధమ స్థానం:9. 8

6.గూట్లపాడు 89/89=100%
ప్రధమస్థానం:9.8(బాలిక)
ద్వితీయస్థానం:9.7(బాలురు-3,బాలికలు-4)

7.గొల్లవానితిప్ప 43/43=100%
ప్రధమస్థానం:9.8(బాలిక)

8.కొవ్వాడ 42/44=95%

9.నాగేంద్ర పురం 53/53=100%
ప్రథమ స్థానం:9.8(బాలురు)

10.తాడేరు 42/42=100%

11.తుందుర్రు 50/50=100%
ప్రధమస్థానం:9.7

12.వెంప 60/61=98%

ఈ ఫలితాలల్లో విజయం సాధించిన  విద్యార్థినీ విద్యార్థులకు. అందుకు కారకులైన HMలకు,ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల కు UTF పక్షాన శుభాకాంక్షలు &  అభినందనలు తెలియజేయుచున్నాను.

-Ch పట్టాభి రామయ్య
ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్
  భీమవరం

IIIT BAASARA NOTIFICATION

UTFBVRM:
💟బాసర ట్రిపుల్ ఐటీ 2016-17 నోటిఫికేషన్ విడుదల💟

💟బాసర : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ (ఆర్టీయూకేటీ) పరిధిలోని బాసర ట్రిపుల్ ఐటీలో 2016-17 విద్యాసంవత్సర (1000 మంది) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సులో చేరేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రతిభగల విద్యార్థులకు ట్రిపుల్‌ఐటీలో చేరి ఉన్నత విద్యనభ్యసించేందుకు ఇదే మంచి సమయం.
💟ప్రవేశ అర్హతలు

* అభ్యర్థులు ప్రథమ ప్రయత్నంలో 2016-ఎస్‌ఎస్‌సీ, తత్సామాన పరీక్షలో రెగ్యులర్‌గా ఉత్తీర్నులై ఉండాలి.
* 31-12-2016 నాటికి 18 ఏళ్లు నిండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యరులకు 21 ఏళ్లు నిండకూడదు.

💟ప్రవేశాల షెడ్యూల్..
* ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పంపేందుకు చివరి తేది : మే 31
* విద్యార్థుల ఎంపిక జాబితా విడుదల తేది : జూన్ 11
* సైనికోద్యోగుల పిల్లలు, వికలాంగులు, ఎస్‌సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ప్రవేశాల కౌన్సెలింగ్ తేది : జూన్ 23
* తొలి విడత ప్రవేశాల కౌన్సెలింగ్ తేది : జూలై 1
* రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్ తేది : జూలై 6
* పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఓరియెంటేషన్ తరగతుల తేది : జూలై 14
* 2016 బ్యాచ్ తరగతులు ప్రారంభం : జూలై 15
💟
జీపీఏ ఆధారంగా అడ్మిషన్లు ఇలా..
పదో తరగతిలో గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ (జీపీఏ) ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఒకే జీపీఏ ఉన్న అభ్యర్థులకు సబ్జెక్టు వారీగా పొందిన గ్రేడ్ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జల్లా పరిషత్ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి జీపీఏకు 0.4 డిప్రెవేషన్ స్కోర్‌ను అదనంగా కలుపుతారు. దీనిని సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన విద్యార్థులకు ఇచ్చే వెయింటేజీగా పేర్కొన్నారు. బాసర ట్రిపుల్‌ఐటీలో 85 శాతం సీట్లను స్థానికంగా, మిగిలిన 15శాతం సీట్లను మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 371 అర్టికల్ డీ సెక్షన్ 95,2014 మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

💟రిజర్వేషన్లు ఇలా...
* ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ-ఏలకు 7 శాతం, బీసీ-బీకి 10 శాతం, బీసీ-సీకి ఒక శాతం, బీసీ-డీకి 7 శాతం, బీసీ-ఈకి 4 శాతం.
* ప్రత్యేక సీట్ల కింద వికలాంగులకు 3 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2 శాతం, ఎన్‌సీసీ విద్యార్థులకు ఒక శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం సీట్లను భర్తీ చేస్తారు.
* 33.33 శాతం సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు. 
💟ఫీజుల వివరాలు...
* రాష్ట్ర పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఏడాదికి రూ.36 వేల ఫీజు చెల్లించాలి. ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లేదు.
* రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 500 చొప్పున చెల్లించాలి. క్యాషన్ (దీనిని తిరిగి ఇస్తారు) డిపాజిట్ కింద ఏ కేటగిరి అభ్యర్థులైనా రూ. 2000 చెల్లించాలి. ఇతర రాష్ర్టాలు, గల్ఫ్‌దేశాల్లో పని చేసే వారి పిల్లలు ఏడాదికి రూ. 1.36 లక్షలు, ఎన్‌ఆర్‌ఎం విద్యార్థులు రూ. 3 లక్షల ట్యూషన్ ఫీజు చెల్లించాలి.

💟దరఖాస్తు చేసుకోండిలా..

* అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ-సేవా, మీ-సేవా కేంద్రాల ద్వారా ఆర్జీయూకేటీ వెబ్‌సైట్ ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
* ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ. 150, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి.
* దరఖాస్తు ఫీజుతో పాటు సర్వీసుచార్జి కింద ఆన్‌లైన్ సెంటర్లకు అదనంగా రూ. 20 చెల్లించాలి.

గ్రేడ్ పాయింట్లు సమానమైతే..
💟
ట్రిపుల్ ఐటీ సీటుకోసం దరఖాస్తు చేసుకున్న ఇద్దరి విద్యార్థుల జీపీఏలు ఒక్కటే అయితే వరుసగా గణితం, జనరల్ సైన్స్, ఇంగ్లిషు, సోషల్‌లో ఎక్కువ గ్రేడ్ వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇవన్నీ సమానంగా ఉంటే ఫస్ట్ లాంగ్వేజ్‌లో ఎక్కువ గ్రేడ్ వచ్చిన వారిని ఎంపిక చేస్తారు. ఇవన్నీ సమానంగా ఉంటే హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

💟దరఖాస్తుతో జత చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు..

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించినప్పుడు ఇచ్చిన రసీదు, పదో తరగతి హాల్ టికెట్, మార్కుల లిస్టు, నివాసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలు, వికలాంగులైతే వైకల్య నిర్ధారణ పత్రాలు, సైనికోద్యోగుల పిల్లలు సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులైతే సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.

💟వసతులు..
విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలతో పాటు, రెండు జతల యూనిఫాం, షూలు, ల్యాప్‌టాప్‌లు, ఇతర సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారు.💟
-PATTABHI

Tuesday 10 May 2016

CAREER AFTER SSC

UTFBVRM:

పదవ తరగతి తర్వాత ఎందులో చేరాలి?

    పదోతరగతి అనంతరం వేయబోయే ప్రతీ అడుగు విద్యార్థుల జీవితంలో కీలక మెట్టు. పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయికి వెళుతున్న ప్రతి విద్యార్థీ సెలవుదినాలను వృధా చేయకుండా పదవ తరగతి తర్వాత చేయదగిన కోర్సుల గురించి తెలుసుకోవాలి. భవిష్యత్‌ను నిర్థేశించుకొని జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడాలి. దీనికోసం విద్యార్థి ఈ స్థాయి నుండే పక్కా ప్రణాళికతో ముందుకుపోవలసిన అవసరం ఉంటుంది. ఇందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారం ప్రధానమైంది. పిల్లల అనుభవాలు లక్ష్యాలకనుగుణంగా వారిని తీర్ఛిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది.పది తర్వాత కొందరు తమ పిల్లలకు ఇష్టం లేకపోయినా మూస పద్ధతిలోనే వెళ్ళడానికి ప్రయత్నిస్తే మరికొందరు మాత్రం తమ పిల్లల అభిరుచికి అనుగుణంగా అడుగులు వేయిస్తారు. ఇక్కడ నుంచి జరిగే విద్యాప్రయాణంలో ఏమాత్రం తడబడినా అది కెరీర్‌కు భంగం కలిగిస్తుంది. అసలు పదో తరగతి పూర్తి అయిన తర్వాత విద్యార్థులు ఎలాంటి కోర్సుల్లో చేరాలి అని కూడా చాలామంది డోలాయమానంలో పడుతుంటారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు తమ ఆసక్తితో పాటు సామర్థ్యాన్ని గుర్తెరిగి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మార్గనిర్దేశనంలో కోర్సులు ఎంచుకుంటే అది వారికి ముళ్ళబాట కాకుండా ఉంటుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యావ్యవస్థలో కూడా నూతన కోర్సులు ఆవిష్కృతమవుతున్నాయి. అయితే, జాబ్ ఓరియెంటెడ్ కోర్సులపై ఇటీవలి కాలంలో విద్యార్థులు అధిక ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్, పాలిటెక్నిక్, ఐటిఐ, ఒకేషనల్ కోర్సులు, ఐఐఐటీలు, పారామెడికల్ కోర్సుల్లో విద్యను అభ్యసించడానికి విద్యార్థులకు అవకాశం ఉంది.

      పదవ తరగతి పాసైన విద్యార్థులకు అర్హత ఉన్న కోర్సులు
    🌹1 ఇంటర్మీడియట్  🌹2 పాలిటెక్నిక్‌
    🌹3 ఒకేషనల్ కోర్సులు
   🌹 4 ఐటీఐ కోర్సులు
    🌹5 రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయము
    🌹6 ఎ.పి.ఆర్.జె.సి
   🌹 7 జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు
    🌹8 ఉద్యోగావకాశాలు

పదో తరగతి తరువాత పయనం ఎటు ?

    పదో తరగతి ఫలితాలు వెలువడక ముందే అన్ని కార్పొరేట్ విద్యాలయాలు ప్రచార మోత మోగిస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఒక విధమైన మానసిక సంఘర్షణకు గురిచేస్తున్నాయి. చాలా మంది విద్యార్థులను ఇష్టం లేకున్నా సైన్స్ కోర్సుల్లో చేర్పిస్తున్నారనే వాదన ఉంది. ఒకరిని చూసి మరొకరు తమ పిల్లలపై బలవంతంగా విద్యను రుద్దడానికి ప్రయత్నిస్తే అదే వారి కెరీర్ పాలిట శాపంగా మారే ప్రమాదముందని గుర్తుంచుకోవాలి. పదో తరగతి తర్వాత చేరే కోర్సుల్లో విద్యార్థులు ఇష్టపూర్తిగా చేరితే వారి కెరీర్‌ను చక్కగా మలచుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో వారికి స్వేచ్ఛనివ్వడం ఎంతైనా అవసరమంటున్నారు మానసిక రంగ నిపుణులు. ఒకవేళ విద్యార్థికి సామర్థ్యముండి అతడు సాధారణ కోర్సులో చేరాలని సంకల్పిస్తే అతడికి కౌన్సెలింగ్ చేసి మనసు మార్చాలని వారు సూచిస్తున్నారు. పది తర్వాత కెరీర్‌కు మార్గదర్శిగా ఉండే రెండు/మూడేళ్ళ కాలం మాత్రం అతి విలువైనది, కీలకమైనదిగా అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థులు భావించి తాము చేరే కోర్సులపై స్పష్టమైన అవగాహనతో నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో చిక్కులు ఉండవని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇంటర్మీడియెట్‌

    సాధారణంగా విద్యార్థులు పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్‌లో చేరడానికి ఉత్సాహం చూపుతారు. ఇప్పటి వరకు ప్రతి విద్యాసంవత్సరం ఎంపిసి కోర్సులో చేరే విద్యార్థులే అధికంగా ఉంటున్నారు. ఇంజనీరింగ్ విద్యలో సులభంగా ప్రవేశాలు లభిస్తుండడంతో ఎంపిసికి అధికంగా డిమాండ్ ఉంది. తర్వాతి స్థానాలను బైపిసి, సిఈసి ఆక్రమిస్తున్నాయి. వీటితో పాటు ఎంఈసీ, హెచ్‌ఈసీ వంటి సంప్రదాయిక కోర్సులతో పాటు తెలుగు సాహిత్యం, సంగీతం తదితర సబ్జెక్టులతో దాదాపు 30 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐఐఐటీల్లోనూ పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు.ఇంటర్మీడియెట్‌లో చేరే సమయంలోనే కెరీర్ విషయంలో ఆచూతూచి వ్యవహరించాలి. మన తోటి మిత్రులు చేరుతున్నారనో, కష్టం లేకుండా చదవాలన్న తపన కారణంగానో భవిష్యత్తును పాడు చేసుకోకుండా విద్యార్థులు తమలో నిబిడీకృతమైన సామర్థ్యాలను తట్టిలేపి జీవితంలో స్థిరపడే విధంగా కెరీర్‌ను ప్లాన్ చేసుకోవాలి. ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ ఇలా చేరే కోర్సులు ఏదైనప్పటికీ ముందే నిర్ణయించుకుంటే మేలు.రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలలో ప్రధానంగా ఐదు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
    అవి:

            ఎంపీసీ
            బైపీసీ
            సీఈసీ
            హెచ్‌ఈసీ
            ఎంఈసీ

ఎం.పి.సి

    దాదాపు 60-70 శాతం మంది విద్యార్దుల యం.పి.సి గ్రూపు వైపు మొగ్గు చూపుతున్నారు. యం.పి.సి చదవటం వల్ల భవిష్యత్‌లో వరించే అవకాశాలు విస్తృతంగా ఉండటమే ఇందుకు కారణం.మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలను మెయిన్ సబ్జెక్టులుగా చదవాలన్న ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సులో చేరవచ్చు.ఈ మూడు సబెక్టులూ వేటికవే ప్రాముఖ్యం కలిగినవే. నిత్య జీవితంతో ముడిపడి, దాదాపు అన్ని రంగాలతో సంబంధం ఉన్న సబ్జెక్టు మేథమెటిక్స్‌ అయితే విస్తరిస్తున్న ఎలక్ట్రానిక్స్‌ / టెలికమ్యూనికేషన్‌ వంటి రంగాలకు సుశిక్షుతులను అందించేది ఫిజిక్స్‌, మందులు, రసాయన పరిశ్రమలు వంటి ఎన్నిటిలోనో ఉపాధి / ఉద్యోగం పొందేలా విద్యార్ధులను తీర్చిదిద్దేది కెమిస్ట్రీ. ఎంపిసితో ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు భవిష్యత్తులో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, సివిల్, మెకానికల్, మెటలర్జీ తదితర విభాగాల్లో ఇంజనీరింగ్ కోర్సును చేయవచ్చు. మన రాష్ట్రంలో ఇందుకోసం ఏటా ఎంసెట్‌ను నిర్వహిస్తున్నారు. వీటికి ఎంసెట్ మెరిట్‌తో పాటు ఇంటర్ మార్కులకు కూడా వెయిటేజీ కల్పిస్తుండడం విశేషం. ఇక ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో నిర్వహించే జేఈఈ, ఏఐఈఈఈ పరీక్షలతో పాటు బిట్స్ పిలానీ వంటి ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో కూడా ఎంపిసి పూర్తి చేసిన విద్యార్థులకు అవకాశం ఉంటుంది. జాతీయ డిఫెన్స్ అకాడమీలో కూడా చేరడానికి ఎంపిసి విద్యార్థులు అర్హులు. సాధారణంగా క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఇంజనీరింగ్ పూర్తయ్యే లోగానే చక్కటి జీతంతో బహుళజాతి కంపెనీలు ప్రతిభగల విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. మరోవైపు, ఇంజనీరింగ్ తర్వాత గేట్ రాసి ఎంటెక్, క్యాట్ ద్వారా ఎంబిఏ వంటి కోర్సుల్లో కూడా ప్రవేశం పొంది ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. ఇంజనీరింగ్‌పై ఆసక్తి లేనివారు ఎంపిసి తర్వాత బిఎస్‌సిలో తమకిష్టమైన కాంబినేషన్లతో చేరి డిగ్రీ చేయవచ్చు. అనంతరం బిఈడి వంటి వృత్తివిద్యా కోర్సులు/ఎంఎస్సీ కోర్సుల వైపు వెళ్ళవచ్చు. తద్వారా పి.హెచ్‌డి సైతం పూర్తి చేసుకుని రీసెర్చి స్కాలర్‌గా అధ్యాపక వృత్తిలో సెటిల్ కావచ్చు. ఇంటర్ ఎంపిసి తర్వాత ఐదేళ్ళ ఇంటిగ్రేట్ ఎంఎస్సీ కూడా చేసే అవకాశాన్ని పలు విశ్వవిద్యాలయాలు కల్పిస్తున్నాయి. ఇవే కాకుండా ఫ్యాషన్ టెక్నాలజీ, లా, సీఏ, ఐసిడబ్ల్యుఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

ఎంపీసీ విద్యార్థులకు అర్హత ఉన్న కోర్సులు

        1.ఇంజనీరింగ్(ఎంసెట్, ఐఐటీ - జేఈఈ , ఏఐఈఈఈ , బిట్ శాట్...)
        2.ఎంసీఏ
        3.ఎన్.డీ.ఎ
        4.3.ఎన్.డీ.ఎ ద్వారా లభించే నేవీ,ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు
        5.త్రివిధ దళాల్లో టెక్నికల్ ఉద్యోగాలు
        6.ఎస్.సీ.ఆర్.ఏ (రైల్వేలో మెకానికల్ ఇంజనీరింగ్)

బై.పి.సి

    కేవలం సైన్స్ అంటే ఇష్టం ఉండి వైద్యవృత్తి, అగ్రికల్చర్ సైన్సెస్ ను కెరీర్ ఆప్షన్లుగా భావించే విద్యార్థులు ఎక్కువ మంది ఇంటర్మీడియట్‌లో బై.పి.సి గ్రూపు తీసుకోనేందుకు ఆసక్తి చూపిస్తారు. బైపిసి గ్రూపుతో ఎం.సెట్‌ ద్వారా మెడిసిన్‌ మాత్రమే కాకుండా బి.ఎస్‌.సి అగ్రికల్చరల్‌, వెటర్నరీ సైన్స్‌, హార్టీకల్చర్‌, ఫిషరీస్‌, బి.హెచ్‌.యం.ఎస్‌. బి.డి.యస్‌. బి.ఫార్మసీలో ప్రవేశం పొందవచ్చు. ఇంటర్మీడియెట్ బైపిసి కోర్సులో చేరతారు. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులుగా ఈ కోర్సు ఉంటుంది. మెడిసిన్‌లో చేరడం సాధ్యం కాకపోతే సంప్రదాయ బిఎస్సీ కోర్సుల్లో చేరి అనంతరం ఎమ్మెస్సీ, పి.హెచ్‌డి వంటి ఉన్నత చదువులు చదివి అధ్యాపక వృత్తిలో సెటిల్ కావచ్చు. పరిశ్రమల్లో కూడా ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంటుంది. బైపిసి పూర్తి చేసిన విద్యార్థులు డీఫార్మసీ, బిఫార్మసీ, నర్సింగ్, ఫిజియోథెరపీ పారామెడికల్ కోర్సులు చేసి చక్కటి ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ వంటి అడ్వాన్స్‌డ్ కోర్సులకు కూడా మంచి డిమాండ్ ఉంది.

బై.పి.సీ విద్యార్థులకు అర్హత ఉన్న కోర్సులు

        1.మెడిసిన్ (అల్లోపతి , ఆయుర్వేద , హోమియో , డెంటిస్ట్రీ)
        2.అగ్రికల్చర్ కోర్సులు
        3.బీఎస్సీ నర్సింగ్ , పారా మెడికల్ కోర్సులు
        4.ఫిజియోథెరపీ
        5.మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (ఎం.ఎల్.టీ)

సిఈసీ/ఎంఈసీ

    సిఏ, ఐసిడబ్ల్యుఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేయాలనుకునేవారు ఇంటర్‌లో సిఈసీ, ఎంఈసీల్లో చేరాల్సి ఉంటుంది. గణితంపై ఆసక్తి లేని వారు సిఈసీలో చేరొచ్చు. ఇటీవలి కాలంలో ఈ రెండు కోర్సులకు కూడా విపరీతమైన ఆదరణ పెరిగింది. కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ రంగాల్లోనే కాకుండా కామర్స్ రంగంలో కూడా ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుందని ఈ కోర్సుల్లో చేరి ప్రొఫెషనల్స్‌గా ఎదిగిన విద్యార్థులు నిరూపించారు. ఎంఈసీలో చేరిన వారికి అటు గణితం, ఇటు కామర్స్ రెండింటిపై పట్టు సాధించే అవకాశం ఉండి క్యాలిక్యులేషన్ ఓరియెంటెడ్ ప్రొఫెసషనల్ కోర్సులను త్వరితగతిన పూర్తిచేయడానికి దోహదపడుతుంది. డిగ్రీలో బి.కాం, పిజిలో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్‌డి వంటి కోర్సులు చేసి అధ్యాపక వృత్తి వైపు కూడా వెళ్ళే వెసులుబాటు ఉంటుంది.

సిఈసీ/ఎంఈసీ విద్యార్థులకు అర్హత ఉన్న కోర్సులు

        1.అకౌంటెంట్,బ్యాంకింగ్
        2.క్లరికల్,స్టాక్ మార్కెట్ జాబ్స్
        3.సివిల్స్,గ్రూప్స్ ఛార్టెడ్ అకౌంటెంట్
        4.ఇన్స్యూరెన్స్,ఎగ్జిక్యూటివ్స్,సేల్స్ ఎండ్ మార్కెటింగ్

హెచ్‌ఈసీ

    సంప్రదాయిక కోర్సుల్లో ప్రముఖంగా చెప్పుకోదగింది, ఎక్కువగా నిరాదరణకు గురవుతోంది హెచ్‌ఈసీ అనేది నిర్వివాదాంశం. హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా సాగే ఈ కోర్సులో చేరేవారంతా మందబుద్ధులే అని గట్టిగా విశ్వసించేవారు ఈ కాలంలోనూ ఉండడం విచారకరమే. పలు కళాశాలల్లో విద్యార్థులు లేక ఈ కోర్సుకే మంగళం పాడేశారు. ఈ విషయం పక్కనపెడితే, ఎంత ప్రతిష్ఠాత్మక సంస్థలో కోర్సులు పూర్తి చేసినా ప్రతి ఒక్కరి డ్రీమ్ ఐఏఎస్, ఐపిఎస్ వంటి కోర్సులపై ఉండడం మనం చూస్తుంటాం. డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబిఏ గ్రాడ్యుయేట్లు కూడా ఈరోజుల్లో సివిల్స్‌వైపు దృష్టి సారిస్తున్నారు. కానీ, వారు సివిల్స్‌లో అర్హత సాధించడానికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఆంత్రోపాలజీ వంటి కోర్సులను ఎంచుకుంటున్నారు. వీటిని హెచ్‌ఈసీ కోర్సు పూర్తి చేసిన వారు సులభంగా ఆకళింపు చేసుకోవచ్చనే విషయం చాలా మందికి తెలియదు. హెచ్‌ఈసీతో ఇంటర్ పూర్తి చేసిన వారు బిఏ, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్‌డి వంటి కోర్సులు పూర్తి చేసి అధ్యాపక వృత్తిని సైతం చేపట్టవచ్చు.

హెచ్‌ఈసీ విద్యార్థులకు అర్హత ఉన్న కోర్సులు

        1.గ్రాఫిక్ డిజైన్(డిజైనర్,విజువలైజర్,ఆర్ట్ డైరక్టర్)
        2.జ్యుయలరీ డిజైన్(ఎక్స్ పోర్ట్ హౌస్ డిజైనర్,జ్యుయలరీ డిజైనర్)
        3.ఆఫీస్ అద్మినిస్ట్రేషన్(అకౌంటెంట్స్/ఆఫీస్ అసిస్టెంట్స్,మేనేజర్,ఎగ్జిక్యూటివ్)
        4.ఫారిన్ లాంగ్వేజెస్(ట్రాన్స్ లేటర్,ట్రావెల్ గైడ్,ఇంటర్ లొకేటర్)
        5.సోషల్ వర్క్ (సోషల్ వర్కర్,రీసెర్చర్,ప్రోజెక్ట్ ఆఫీసర్,హెల్త్ కేర్ సోషల్ వర్కర్)

పాలిటెక్నిక్‌

    పదోతరగతి తర్వాత సాంకేతిక విద్య పట్ల ఆసక్తి ఉన్న వారు పాలిటెక్నిక్‌, ఐటిఐ ఎటిఐల నుండి కోర్సులను ఎంచుకోవచ్చు. మన రాష్ట్రంలో కొన్ని పాలిటెక్నిక్‌లు, ప్రింటింగ్‌ టెక్నాలజీ, లెథర్‌ టెక్నాలజి, టెక్స్‌టైల్‌ టెక్నాలజి, షుగర్‌ టెక్నలజీ లాంటి అరుదైన కోర్సులను నిర్వహిస్తున్నాయి. పదో తరగతి తర్వాత ఇటీవల కాలంలో ఎక్కువ మంది పాలిటెక్నిక్‌ కోర్సువైపు మొగ్గు చూపుతున్నారు. ఆ కోర్సుకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటమే దీనికి కారణం. లేదా నేరుగా పాలిటెక్నిక్‌ తర్వాత ఇ-సెట్‌ ద్వారా ఇంజనీరింగ్‌లో చేరవచ్చు.పది తర్వాత ఇంజనీరింగ్ డిప్లొమా చేరడానికి ప్రభుత్వం పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష (సీప్‌) నిర్వహిస్తోంది. రాష్టవ్య్రాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ పరీక్షలో ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ వంటి విభాగాల్లో డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.ఇవి పూర్తయితే ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో నేరుగా ప్రవేశించవచ్చు.మూడేళ్ళ కాలవ్యవధి ఉండే ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత అప్రెంటిష్‌షిప్ పూర్తి చేస్తే ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా, బిటెక్/బిఈలో చేరే విద్యార్థులకు మూడేళ్ళలోనే కోర్సు పూర్తి చేసే లేటరల్ ఎంట్రీ స్కీంలో కూడా అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం వీరు ఈసెట్ రాయాల్సి ఉంటుంది.
    మరిన్ని వివరాలకు : apceep.nic.in

ఒకేషనల్ కోర్సులు

    వృత్తివిద్య నేటి పోటీ ప్రపంచములో నిరుద్యోగ నిర్మూలనకు,స్వయం ఉపాధి కల్పనకు దోహదం చేస్తుంది.పదో తరగతి తర్వాత ఒకేషనల్ కోర్సుల ద్వారా స్వల్ప కాలంలోనే ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చు.మరోవైపు ఉన్నత విద్యకూ ఒకేషనల్ కోర్సులు అవకాశం కల్పిస్తున్నాయి.మన రాష్ట్రములో ఇంటర్మీడియట్ బోర్డు పదోతరగతి పాసైన విద్యార్ధులకోసం అనేక ఒకేషనల్ కోర్సులను అందుబాటులోనికి తెచ్చింది.వీటిలో చేరడం ద్వారా తక్కువ వ్యయంతోనే సాంకేతిక విద్యకు,ఉపాధికి మార్గం సుగమం చేసుకోవచ్చు.అగ్రికల్చర్,బిజినెస్ అండ్ కామర్స్,కంప్యూటర్ అండ్ హ్యుమానిటీస్,ఇంజినీరింగ్ అండ్ టెక్నికల్,హెల్త్ అండ్ పారామెడికల్,హోంసైన్స్ వంటి విభాగాల్లో అనేకమైన రెండేళ్ళ కోర్సులు ఉన్నాయి.వీటన్నింటికీ అర్హత పదో తరగతి.
    మరిన్ని వివరాలకు : 1) after10thwhat.com 2) study.taaza.com

ఐటీఐ కోర్సులు

    వృత్తి నైపుణ్యాలకు వేదిక 'ఐటీఐ'.పదో తరగతి తర్వాత ముందుగా చిన్నపాటి ఉద్యోగంలో స్థిరపడాలనుకునేవారు ఐటీఐ కోర్సులను ఎంచుకుంటారు. ఇందులో టర్నర్‌, ఫిట్టర్‌, మెషినిస్టు, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, డీజిల్‌ మెకానిక్‌, మోటార్‌ మెకానిక్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ సివిల్‌, రిఫ్రిజిరేటర్‌, ఏసీ, కంప్యూటర్‌ ఆపరేటర్‌, ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ వీటిలో రెండేళ్ల, సంవత్సరకాల పరిమితితో కూడిన కోర్సులు ఉన్నాయి.
    మరిన్ని వివరాలకు : after10thwhat.com

రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయము

    పదవ తరగతి తర్వాత ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేయదల్చుకున్న అభ్యర్తుల కోసం ఆర్జీయూకేటి ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. పదవ తరగతిలో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ముఖ్యంగా గ్రామాల్లోని పేద విద్యార్థులకు ఉత్తమ ప్రమాణాలలో విద్య అందించు నిమిత్తం నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ, జిల్లా పరిషత్ మరియు మున్సిపల్ పాఠశాలల్లోచదివిన విద్యార్థులకు వారి పదవ తరగతి స్కోర్‌కు 0.4% కలిపి ఎక్కువ అవకాశం వచ్చేలా చేస్తారు.రాష్ట్రంలోని ఇతర కాలేజీలు, యూనివర్శిటీలతో పోలిస్తే ఇక్కడి విద్యావిధానం పూర్తిగా భిన్నం. అందుకే ఇంటర్మీడియట్ నుండి కాకుండా పదవ తరగతి తర్వాత నుంచే విద్యార్థులను చేర్చుకుంటారు. సిలబస్ ఐఐటీల స్థాయిలో ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పేద పిల్లలకు విద్యను ఉచితంగా అందించడమే లక్ష్యం. కాకపోతే ఇతరత్రా అగ్రకులాల వారికి నామమాత్రపు ఫీజు ఉంటుంది. రెసిడెన్షియల్ కాబట్టి విద్యార్థి ఖచ్చితంగా క్యాంపస్‌లోనే ఉండి చదువుకోవాలి. ఫుడ్, అకామడేషన్, యూనిఫార్మ్, షూస్, బుక్స్, ల్యాప్ టాప్ తదితర అన్నీ కూడా కాలేజ్ ప్రతీ స్టూడెంట్‌కూ ఫ్రీగా ఇస్తుంది.
    మరిన్ని వివరాలకు : rgukt.in

ఎ.పి.ఆర్.జె.సి/ఎ.పి.ఆర్.డి.సి

    ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాలలకు మరియు డిగ్రీ కళాశాలలో చేరడానికి ప్రవేశపరీక్ష(ఎ.పి.ఆర్.జె.సి. మరియు డిసి-సెట్) ఉంటుది . ఎ.పి.ఆర్.జె.సి. మరియు డి.సి, ప్రవేశపరీక్షకు ఏటా లక్షకు పైగా విద్యార్థినీ, విద్యార్థులు పోటీపడుతున్నారు. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదివిన విద్యార్థినీ, విద్యార్థులు ప్రవేశపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా, జూనియర్ కళాశాలలో ప్రాంతీయ ప్రాతిపదికపై, డిగ్రీ కళాశాలలో యూనివర్శిటీ ప్రాంతాన్ని అనుసరించి ప్రవేశం కల్పిస్తారు.ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాలలు రెండు రకాలు. 1) సాధారణ గురుకుల జూనియర్ కళాశాలలు 2) ముస్లిం మైనారిటీ జూనియర్ కళాశాలలు.ఎ.పి.ఆర్.జె.సి. మరియు డి.సి ప్రవేశపరీక్ష పూర్తిగా మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ఎ.పి.ఆర్.జెసి. ప్రవేశపరీక్ష 10వ తరగతి సిలబస్ ఆధారంగా, ఎ.పి.ఆర్.డి.సి. ప్రవేశపరీక్ష ఇంటర్ సిలబస్ ఆధారం ప్రవేశపత్రం రూపొందిస్తారు. ప్రశ్నాపత్రంలో 150 ప్రశ్నలు వుంటాయి. వ్యవధి గం.2.30 ని.లు ప్రశ్నాపత్రం తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.
    మరిన్ని వివరాలకు : apresidential.gov.in

జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు

    పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్‌కు ప్రత్యామ్నాయంగా పలు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఏవియేషన్ వంటి కోర్సులు కాస్త ఖరీదైనప్పటికీ సృజనాత్మకత ఉన్న విద్యార్థులకు ఆయా రంగాల్లో చక్కటి అవకాశాలు కలిగిస్తున్నాయి. అయితే, ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులు తాము చేరుతున్న విద్యాసంస్థలకు అఫిలియేషన్ ఉందా, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి తదితర విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి నిపుణుల సలహా తీసుకుని చేరడం మంచిది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్‌ల్లో(ఐటిఐ) కూడా డీజిల్ మెకానిక్, ఫిట్టర్ వంటి స్వల్పకాలిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐటిఐ కోర్సులతో పాటు అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన వారికి రైల్వే, ఆర్టీసీల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి.
    మరిన్ని వివరాలకు : 1) creepindia.com 2) acclm.in 3) after10thwhat.com

ఉద్యోగావకాశాలు

    పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కూడా భారీగానే ఉన్నాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, స్ట్ఫా సెలక్షన్ కమిషన్, ఐబిపిఎస్(బ్యాంకుల్లో క్లర్కు పోస్టులకు పరీక్ష నిర్వహించే సంస్థ), కానిస్టేబుల్స్, క్లర్కులు ఇలా ఎన్నో పోస్టులకు పదవ తరగతి ప్రాథమిక విద్యార్హతగా పేర్కొంటున్నారు. సాధారణంగా పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు 16 సంవత్సరాలు నిండి ఉంటాయి. కానీ, చాలా ఉద్యోగాలకు పదవ తరగతి పూర్తి చేసి 18 ఏళ్ళు నిండి ఉండాలనే నిబంధన ఉంది. పదో తరగతి పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడాలనుకునేవారు తరచూ ఇంటర్నెట్ వాడడం, ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ వంటి పత్రికలు చదవడం వంటివి ఇప్పటి నుంచే అలవరచుకుంటే మంచిది.

-PATTABHI