Wednesday 11 May 2016

FAPTO NEWS

తాజా ‌సమాచారం
ఈ రోజు (11.5.16)  ఫ్యాప్టో  నాయకత్వం ఐ.వెంకటేశ్వరరావు (యుటియఫ్), కె.నరసింహారెడ్డి (యస్టీయు), యన్.వి.రమణయ్య (డిటియఫ్) విద్యాశాఖ కార్యదర్శి ఆర్.పి.శిసోడియా గారిని కలిసి పలు సమస్యల పై చర్చించారు.

1.రేషనలైజేషన్ పై గత సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలు చేసిన సూచనలు అమలు  చేయాలని, ఏక పక్షంగా పాఠశాలలు మూసివేయరాదని కోరారు.

ఫ్యాప్టో నాయకత్వం కోరినట్లుగా రేషనలైజేషన్ పై పునఃపరిశీలన చేస్తామని, మరోసారి ఉపాధ్యాయ సంఘాల తో చర్చించి ఫైనల్ చేస్తామని వారు తెలిపారు.

రేషనలైజేషన్ వల్ల ఎన్ని పాఠశాలలు మూతపడతాయో వివరాలు సేకరించి పంపాలని డైరెక్టర్ గారిని కోరారు. "మన ఊరు - మన బడి" కార్యక్రమంలో ఎన్రోల్ అయిన విద్యార్ధుల సంఖ్య ఆధారంగా రేషనలైజేషన్ చేపడతామని తెలిపారు.

2.మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు నివాసం ఉన్న గ్రామంలోనే భోజనం ఏర్పాట్లు చేయాలి. ఉపాధ్యాయులకు సెలవు ల్లో ఈ బాధ్యతలు తొలగించాలని కోరారు.

నివాసం ఉన్న గ్రామంలో భోజనం ఏర్పాట్లు కు చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ గారిని ఆదేశించారు.ఉపాధ్యాయులకు ఎరెండ్ లీవ్ ఇస్తామని స్పష్టం చేశారు.

3.పండితులు, పిఈటీ ల అప్ గ్రేడేషన్ ఫైలు పై సియం.కార్యాలయం వారు కోరిన సమాచారం తిరిగి పంపుతున్నట్లు చెప్పారు. సంవత్సరానికి 16కోట్లు ఖర్చు అంచనాలతో పంపుతున్నట్లు తెలిపారు.

4.ఎయిడెడ్ రేషనలైజేషన్,ప్రమోషన్స్,పోస్టులు భర్తీ ఫైలు ఆర్థిక మంత్రి కి పంపినట్లు తెలిపారు.

5.అంతర్ జిల్లా బదిలీల పైలు విద్యా శాఖ మంత్రి కి పంపారు. అనంతరం ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి కి వెళుతుందని కార్యదర్శి గారు తెలిపారు.

6.సర్వీస్ రూల్స్ ఫైలు పై కేంద్ర హోంశాఖ కొన్ని వివరాలు అడిగారని, రెట్రాస్పెక్టివ్ గా ఎందుకు అమలు చేయాలి అని వివరణ కోరినట్లు తెలిపారు.

7.బదిలీ ద్వారా యంఇఓ పోస్టుల భర్తీ చేసే ఫైలు జిఏడి కి పంపినట్లు కార్యదర్శి గారు తెలిపారు.

- పి. బాబు రెడ్డి
యుటియఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

No comments:

Post a Comment