Friday 21 August 2015

UTF darna at COLLECTORATE,ELURU on TODAY@10am
DEMANDS:
Aided&Municipal teachers problems
PRC Related GOs
Pndits,PET Upgradation Etc
సమస్యల పరిష్కారం కోసం 22nd యు.టి.ఫ్ కలెక్టరెట్ వద్ద మహా దర్నా.
Partcipat&make success
-PATTABHI

Aided Budget

ప్రచురణార్థం
ఎయిడెడ్‌ టీచర్ల జీతా బడ్జెట్‌ విడుద - యుటియఫ్‌
రాష్ట్రంలోని ఎయిడెడ్‌ ఎలిమెంటరీ, సెకండరీ, ఒరియంటల్‌ పాఠశాలల జీతాలు 4 క్వార్టర్ల బడ్జెట్‌ను జిఓ ఆర్‌టి నం.2275, తేది.21.08.2015న ఆర్థికశాఖ కార్యదర్శి కె.సునీత ఉత్తర్వులు విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటియఫ్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎలిమెంటరీ పాఠశాలలకు 1,95,68,80,000, సెకండరీ పాఠశాలలకు 2,93,32,02,000, ఓరియంటల్‌ పాఠశాలలకు 33,32,85,000 రూపాయల వంతున బడ్జెట్‌ను విడుదల చేశారు. అయినా ప్రైమరీ మరియు ఓరియంటల్‌ పాఠశాలలకు బడ్జెట్‌ సరిపడంతలేదు. మారిన ఆర్థిక విధానాల ద్వారా ప్రతినెలా జీతాలు అందేవిధంగా ఉత్తర్వులు ఇస్తామని చెప్పినప్పటికి ఈ ఉత్తర్వులలో ఏ క్వార్టర్‌ బడ్జెట్‌ అదే క్వార్టర్‌లో వాడుకోవాలని నిబంధనను విధించడం సరైనది కాదు. మొత్తం బడ్జెట్‌ను క్వార్టర్‌ అనే నిబంధన లేకుండా ప్రతినెలా  జీతాలు చెల్లించేందుకు ఆదేశాలు ఇవ్వాలని యుటియఫ్‌ నాయకులు విజ్ఞప్తి చేశారు.

(ఐ.వెంకటేశ్వరరావు)   (పి.బాబురెడ్డి)
        అధ్యక్షులు            ప్రధానకార్యదర్శి

Thursday 20 August 2015

‪#‎ప్రచురణార్థం‬
డిటెన్షన్‌ విధానం వద్దు - యుటియఫ్‌
ఉత్తీర్ణులైతేనే పై తరగతుకు పంపేలా పరీక్షా విధానం ఉండాని Central Advisory Board of Education (CABE) విద్య కేంద్రీయ సహా మండలి సిఫార్సు చేసినట్లుగా కేంద్రమంత్రి ప్రకటించారు. 1969`70 సం॥లో అనేక చర్చలు జరిపి నాన్‌ డిటెన్షన్‌ విధానాన్ని ప్రవేశ పెట్టారు. కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉన్న విధానం మార్పు చేయబోయేముందు విస్తృతంగా చర్చ జరపాలని యుటియఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. పరీక్షలు అంటే కేవలం మార్కు ఆధారంగా పాస్‌, ఫెయిల్‌ మాత్రమే కాదు. విద్యార్ధి సామర్ధ్యాలను నిరంతరం అన్ని కోణాల్లోనూ అంచనా వేయాలి తప్ప, సంవత్సరం చివరల్లో వ్రాసే పరీక్షలను బట్టి వారి భవిష్యత్‌ నిర్ణయించడం సరైంది కాదని అనేకమంది విద్యావేత్తలు ప్రకటించారన్నారు.
వివిధ సర్వేల ఆధారంగా ప్రస్తుత విద్యా విధానంలో పరీక్షలు లేకపోవడం వల్లనే నాణ్యమైన చదువు రావడం లేదని ప్రచారం చేస్తున్నారు. దీనికి కారణం విద్యావ్యవస్థను బలహీనపరిచిన ప్రభుత్వ విధానాలే. ఒకరిద్దరితో పాఠశాలలు నడిపితే నాణ్యమైన విద్య ఎలా వస్తుందని వారు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు నవోదయ పాఠశాలల్లో నాన్‌ డిటెన్షన్‌ విధానం అమలు జరిపినప్పటికి మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.
ఇప్పుడున్న విధానంలోనే 10వ తరగతిలోపు 27% మంది డ్రాపౌట్‌ అవుతున్నారు. ఇక ప్రతి సంవత్సరం ఉత్తీర్ణత అంటే అలా కాలేనివారు డ్రాపౌట్‌ అవుతారు. పేద విద్యార్ధులే ఎక్కువగా విద్యకు దూరం అవుతారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ప్రతి తరగతికి ఒక టీచరు, ఇంగ్లీషు మీడియం బోధన ఏర్పాటు చేయడంతో నాణ్యమైన విద్యనందించవచ్చునని యుటియఫ్‌ నాయకులు తెలిపారు.
(ఐ.వెంకటేశ్వరరావు)              (పి.బాబురెడ్డి)
        అధ్యక్షులు                   ప్రధానకార్యదర్శి
http://aputf.org/

--- --- Sent by WhatsApp

Wednesday 19 August 2015

UTF Dt level DHARNA

UTF darna at collectorate eluru on 22nd 10am issues aided, municipal teachers problem, PRC Related go's pandits, pet upgradation. Attend teachers & make it success

Tuesday 18 August 2015

Go 53

#APUTF :  జిఓ 53 ఉత్తర్వులు అబియన్స్‌
కమిటీ వేసి ప్రతిపాదను పంపండి - విద్యాశాఖ మెమో 
విద్యాశాఖ ఈ నె 14న విడుదల చేసిన జిఓ 53ని నిలుపుదల చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి ఆర్‌పి సిసోడియా మెమో నం.596, తేది.18.08.2015 (మంగళవారం) విడుదల చేసారని ఆంధ్రప్రదేశ్‌ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటియఫ్‌) అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి తెలిపారు. సక్సెస్‌ పాఠశాలలను ఇంగ్లీషు మీడియంగా మార్పు చేసేదానికి ఒక కమిటీ నియామకం చేసి విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపి ప్రభుత్వానికి రికమండేషన్స్‌, సూచను పంపించాలని మెమోలో పేర్కొనడం జరిగిందని వారు తెలిపారు.
ఉపాధ్యాయుల బదిలీలకు ఫెర్మామెన్స్‌ పాయింట్స్‌ ఫైనల్‌ చేసిన వెంటనే బదిలీలకు షెడ్యూల్‌ విడుదల చేస్తామని, ప్రధానోపాధ్యాయుల బదిలీలకు గరిష్ట సర్వీస్‌ 5 సం॥లుగా మార్పు చేస్తూ సవరణ ఉత్తర్వులు యిస్తామని, ఈ విద్యా సంవత్సరంలో ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రేషనలైజేషన్‌ ప్రక్రియ చేపట్టడం లేదని విద్యాశాఖ కార్యదర్శి తెలియజేశారని ఫ్యాప్టో నేతలు  తెలియజేశారు. చిత్తూరు, విశాఖ, ప్రకాశం జిల్లాలో ఎస్‌జిటి వేకెన్సీలో పనిచేస్తున్న పండితులను పండిట్స్‌ వేకెన్సీలో సర్దుబాటు చేస్తూ ఆదేశాలలు ఇవ్వాలని డైరెక్టర్‌ గారిని ఆదేశించినట్లు వారు తెలిపారు.

http://aputf.org/