Tuesday 14 July 2015

FAPTO VIJAYAM

మిత్రులారా, MLC  రామకృష్ణకు ప్రస్తుత ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేదు. ఈ credit మొత్తం FAPTO ది, support చేసి, ప్రాతినిధ్యాలు చేసి,   నిరాహారదీక్షలు చేసిన PDF MLC లు శ్రియుతులు వి.బాలసుబ్రహ్మణ్యం, ఎం.గేయానంద్ , ఎం.వి.ఎస్ .శర్మ, వై.శ్రీనివాసులురెడ్ది, బి.నాగేశ్వరరావు, ఆర్ .సూర్యారావు మరియు మాజీ MLC శ్రీకె.ఎస్ .లక్ష్మణరావు గారలతో పాటు ఈఉద్యమంలో పాల్గొన్న ఉపాధ్యాయులందరిది. రామకృష్ణ గారు ఉద్యమం జరుగుతున్నపుడు ఎక్కడున్నారో తెలియదు, FAPTO పోరాటాలకు మద్దతు పలకలేదు, ఆయన నియోజకవర్గంలో తోటి MLC లు నిరాహారదీక్ష చేస్తుంటే సంఘీభావం తెలుపకపోగా కనీసం పలుకరించిన పాపాన పోలేదు, చివరికి అక్రమబదిలీలకు వ్యతిరేకంగా పత్రికాప్రకటనైనా ఇవ్వలేదు. ఈరోజు చర్చల్లో కూడా TDP MLC హోదాలో ప్రభుత్వం తరఫున పాల్గొన్నాడేకానీ FAPTO తరఫున కాదు. అలాంటి వ్యక్తికి continuous efforts పెట్టాడని కీర్తిస్తూ credit ఆపాదించడమంటే మహత్తర ఉపాధ్యాయ ఉద్యమాన్ని వంచించి అవమానించడమే అవుతుంది. అసలు చర్చల్లో ఆయనను కూర్చోబెట్టడంలోనే ఈవిజయంలో ఆయనను భాగస్వామిని చేయాలనే అధికారపార్టీ కుట్రను మనం గమనించకపోతే ఎలా? ఏమైనా ఈపోరాటంలో నైతిక మద్దతునిచ్చిన ఉద్యోగ,అధ్యాపక సంఘాలకు ధన్యవాదాలు.

No comments:

Post a Comment