Sunday 5 July 2015

News Updates

UTFBVRM:
Muncipal teachers
trainings are
Successfully boycotted
in all dist.
We oppose corporate involvement
in mpl schools.
-APUTF
****
Prevent EL for Election duty 2014 wide proceeding RC No 362/E 1-1/2013 Dt. 16-11-2013 of the Director of School Education AP HYD
PO s, APOs
*****

* డీఎడ్, ఎల్పీసెట్ ప్రకటనల జారీలో జాప్యం
ఈనాడు, హైదరాబాద్: వృత్తి విద్య ప్రవేశ పరీక్షల నిర్వహణలో ముందంజలో ఉన్న ఏపీ విద్యాశాఖ ఉపాధ్యాయ విద్య (డీఎడ్), భాషాపండితుల (ఎల్పీసెట్) ప్రవేశ పరీక్షలపై ప్రకటనలు జారీ చేయకపోవడంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 2015-16 నుంచి ఈ పరీక్షలను తెలుగు రాష్ట్రాల్లో విడివిడిగా జరపాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం డైట్‌సెట్ ప్రకటన ఇవ్వడమే కాకుండా, వచ్చేవారం నుంచి దరఖాస్తుల్ని స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసింది. అదే ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా చర్చల స్థాయిలోనే ఉంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణలయిన వారు ముందుగా డైట్‌సైట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడ సీటు రాకుంటేనే డిగ్రీలో చేరుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల డిగ్రీ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభమయినందున డైట్‌సెట్ ప్రకటన రాకపోవడంతో అయోమయంలోపడ్డారు. ఒకవేళ ఇప్పుడు ప్రకటన ఇచ్చినా ఆగస్టు చివర్లో పరీక్షలు, సెప్టెంబరులో కౌన్సెలింగ్ జరిగే వీలుంది. ఇప్పుడు డిగ్రీలో చేరి, మళ్లీ అప్పుడు డీఎడ్‌లో చేరాలంటే సమయం, డబ్బు వృథా అవుతాయని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. సెప్టెంబరు తరువాత డిగ్రీ కళాశాలల్లో చేరాలన్నా ఇబ్బందేనని అంటున్నారు. కౌన్సెలింగ్ సమయంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నుంచి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. కోర్టు కేసులు ఇతర కారణాలతో కౌన్సెలింగ్‌లో జాప్యం జరుగుతోంది. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభమే ఆలస్యంగా జరుగుతోంది. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దీని ప్రభావం కనిపిస్తోంది. తమకు అవకాశం కల్పించాలంటూ చివరి సంవత్సరం విద్యార్థులు కోరిన సందర్భాలు ఉన్నాయి. ఈ గందరగోళం నివారించడానికి సకాలంలో ఈ రెండు కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు.

No comments:

Post a Comment