#ప్రచురణార్థం
డిటెన్షన్ విధానం వద్దు - యుటియఫ్
ఉత్తీర్ణులైతేనే పై తరగతుకు పంపేలా పరీక్షా విధానం ఉండాని Central Advisory Board of Education (CABE) విద్య కేంద్రీయ సహా మండలి సిఫార్సు చేసినట్లుగా కేంద్రమంత్రి ప్రకటించారు. 1969`70 సం॥లో అనేక చర్చలు జరిపి నాన్ డిటెన్షన్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉన్న విధానం మార్పు చేయబోయేముందు విస్తృతంగా చర్చ జరపాలని యుటియఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పరీక్షలు అంటే కేవలం మార్కు ఆధారంగా పాస్, ఫెయిల్ మాత్రమే కాదు. విద్యార్ధి సామర్ధ్యాలను నిరంతరం అన్ని కోణాల్లోనూ అంచనా వేయాలి తప్ప, సంవత్సరం చివరల్లో వ్రాసే పరీక్షలను బట్టి వారి భవిష్యత్ నిర్ణయించడం సరైంది కాదని అనేకమంది విద్యావేత్తలు ప్రకటించారన్నారు.
వివిధ సర్వేల ఆధారంగా ప్రస్తుత విద్యా విధానంలో పరీక్షలు లేకపోవడం వల్లనే నాణ్యమైన చదువు రావడం లేదని ప్రచారం చేస్తున్నారు. దీనికి కారణం విద్యావ్యవస్థను బలహీనపరిచిన ప్రభుత్వ విధానాలే. ఒకరిద్దరితో పాఠశాలలు నడిపితే నాణ్యమైన విద్య ఎలా వస్తుందని వారు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు నవోదయ పాఠశాలల్లో నాన్ డిటెన్షన్ విధానం అమలు జరిపినప్పటికి మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.
ఇప్పుడున్న విధానంలోనే 10వ తరగతిలోపు 27% మంది డ్రాపౌట్ అవుతున్నారు. ఇక ప్రతి సంవత్సరం ఉత్తీర్ణత అంటే అలా కాలేనివారు డ్రాపౌట్ అవుతారు. పేద విద్యార్ధులే ఎక్కువగా విద్యకు దూరం అవుతారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ప్రతి తరగతికి ఒక టీచరు, ఇంగ్లీషు మీడియం బోధన ఏర్పాటు చేయడంతో నాణ్యమైన విద్యనందించవచ్చునని యుటియఫ్ నాయకులు తెలిపారు.
(ఐ.వెంకటేశ్వరరావు) (పి.బాబురెడ్డి)
అధ్యక్షులు ప్రధానకార్యదర్శి
http://aputf.org/
Thursday, 20 August 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment