Tuesday 18 August 2015

Go 53

#APUTF :  జిఓ 53 ఉత్తర్వులు అబియన్స్‌
కమిటీ వేసి ప్రతిపాదను పంపండి - విద్యాశాఖ మెమో 
విద్యాశాఖ ఈ నె 14న విడుదల చేసిన జిఓ 53ని నిలుపుదల చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి ఆర్‌పి సిసోడియా మెమో నం.596, తేది.18.08.2015 (మంగళవారం) విడుదల చేసారని ఆంధ్రప్రదేశ్‌ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటియఫ్‌) అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి తెలిపారు. సక్సెస్‌ పాఠశాలలను ఇంగ్లీషు మీడియంగా మార్పు చేసేదానికి ఒక కమిటీ నియామకం చేసి విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపి ప్రభుత్వానికి రికమండేషన్స్‌, సూచను పంపించాలని మెమోలో పేర్కొనడం జరిగిందని వారు తెలిపారు.
ఉపాధ్యాయుల బదిలీలకు ఫెర్మామెన్స్‌ పాయింట్స్‌ ఫైనల్‌ చేసిన వెంటనే బదిలీలకు షెడ్యూల్‌ విడుదల చేస్తామని, ప్రధానోపాధ్యాయుల బదిలీలకు గరిష్ట సర్వీస్‌ 5 సం॥లుగా మార్పు చేస్తూ సవరణ ఉత్తర్వులు యిస్తామని, ఈ విద్యా సంవత్సరంలో ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రేషనలైజేషన్‌ ప్రక్రియ చేపట్టడం లేదని విద్యాశాఖ కార్యదర్శి తెలియజేశారని ఫ్యాప్టో నేతలు  తెలియజేశారు. చిత్తూరు, విశాఖ, ప్రకాశం జిల్లాలో ఎస్‌జిటి వేకెన్సీలో పనిచేస్తున్న పండితులను పండిట్స్‌ వేకెన్సీలో సర్దుబాటు చేస్తూ ఆదేశాలలు ఇవ్వాలని డైరెక్టర్‌ గారిని ఆదేశించినట్లు వారు తెలిపారు.

http://aputf.org/

No comments:

Post a Comment