Friday 21 August 2015

Aided Budget

ప్రచురణార్థం
ఎయిడెడ్‌ టీచర్ల జీతా బడ్జెట్‌ విడుద - యుటియఫ్‌
రాష్ట్రంలోని ఎయిడెడ్‌ ఎలిమెంటరీ, సెకండరీ, ఒరియంటల్‌ పాఠశాలల జీతాలు 4 క్వార్టర్ల బడ్జెట్‌ను జిఓ ఆర్‌టి నం.2275, తేది.21.08.2015న ఆర్థికశాఖ కార్యదర్శి కె.సునీత ఉత్తర్వులు విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటియఫ్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎలిమెంటరీ పాఠశాలలకు 1,95,68,80,000, సెకండరీ పాఠశాలలకు 2,93,32,02,000, ఓరియంటల్‌ పాఠశాలలకు 33,32,85,000 రూపాయల వంతున బడ్జెట్‌ను విడుదల చేశారు. అయినా ప్రైమరీ మరియు ఓరియంటల్‌ పాఠశాలలకు బడ్జెట్‌ సరిపడంతలేదు. మారిన ఆర్థిక విధానాల ద్వారా ప్రతినెలా జీతాలు అందేవిధంగా ఉత్తర్వులు ఇస్తామని చెప్పినప్పటికి ఈ ఉత్తర్వులలో ఏ క్వార్టర్‌ బడ్జెట్‌ అదే క్వార్టర్‌లో వాడుకోవాలని నిబంధనను విధించడం సరైనది కాదు. మొత్తం బడ్జెట్‌ను క్వార్టర్‌ అనే నిబంధన లేకుండా ప్రతినెలా  జీతాలు చెల్లించేందుకు ఆదేశాలు ఇవ్వాలని యుటియఫ్‌ నాయకులు విజ్ఞప్తి చేశారు.

(ఐ.వెంకటేశ్వరరావు)   (పి.బాబురెడ్డి)
        అధ్యక్షులు            ప్రధానకార్యదర్శి

No comments:

Post a Comment